SAKSHITHA NEWS

Farmers in Palnadu are benefited by the efforts of MP Lau Shrikrishna Devarayalu

ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కృషితో పల్నాడులో రైతులకు మేలు కలిగించే ప్రాజెక్ట్ నిర్మాణంలో అడుగులు

-ఇండో – ఇజ్రాయెల్ ‘ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధిత బృంద పర్యటన

-అత్యంత త్వరగా ప్రాజెక్ట్ స్థాపన చేస్తాం – సంబంధిత ప్రాజెక్ట్ ప్రతినిధులు

అతి తక్కువ నీటి వాడకంతో, తక్కువ ఎరువులు, రసాయానాలు వాడకంతో వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తున్న ఇజ్రాయెల్ దేశపు సాంకేతికతను మన దేశంలో వినియోగించుకునేందుకు.. కుదుర్చుకున్న ‘ ఇండో – ఇజ్రాయెల్ ‘ ఒప్పందపు ప్రాజెక్ట్ ను పల్నాడు లో నెలకొల్పేందుకు గాను సంబంధిత బృందం నేడు పల్నాడులో పర్యటించింది.

నకరికల్లు మండలం, గుండ్లపల్లిలో 25.57 ఎకరాల సంబంధిత ప్రోజెక్ట్ భూమిని బృందం పరిశీలించింది.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పల్నాడు ప్రధానంగా వ్యవసాయం ఎక్కువ గా ఉంటుందని అన్నారు. ఎక్కువగా మిర్చి, ప్రత్తి వంటి పంటలు అధికంగా సాగు జరుగుతున్నాయని అన్నారు.

గతేడాది తెగుల్లతో మిర్చి పంట రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది అని అన్నారు. మరో సమస్య .. మన రైతులు అధికంగా ఎరువులు వాడి సాగు చెయ్యటం వల్ల.. దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ.. సరైన ధర రావడం లేదని అన్నారు.

ఈ ప్రాజెక్ట్ వస్తే రైతులకు కొత్త విధానాలు ద్వారా మేలు జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో కుప్పంలో విస్తరించారు అని, అక్కడ కూరగాయలు పండిస్తున్నారు అని తెలిపారు.

గత ఏడాదిగా ఈ ప్రోజెక్ట్ కోసం ఎంతో కృషి చేస్తున్నామని ఎంపీ అన్నారు. ఈ ప్రోజెక్ట్ స్థాపన జరిగి సాగులో మంచి ఫలితాలు వస్తే.. రైతులకు నమ్మకం కలుగుతుందని, వారి ఈ కొత్త విధానాలకు మరలుతారని, దశల వారీగా ఈ ప్రోజెక్ట్ ను వృద్ధి చేయవచ్చు అని ఎంపీ పేర్కొన్నారు.

అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ స్థాపన జరిగేలా చూస్తామని ఈ ప్రాజెక్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇండో – ఇజ్రాయెల్ ఎంబసీ ప్రతినిధి యార్ , ప్రోజెక్ట్ అగ్రీ డివిజన్ హెడ్ బ్రహ్మా దేవ్, కమిషనర్ ఆఫ్ హార్టికల్చరల్ అదనపు డైరెక్టర్ వేంకటేశ్వర రావు, హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ ధర్మజ, పల్నాడు జిల్లా హార్టికల్చర్ అధికారి బిన్నీ , నకరికల్లు మండల వైసీపీ అధ్యక్షులు భవణం రాఘవ రెడ్డి తదితరులు, అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS