ఆరు గ్యారెంటీ ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లోని సుభాష్ నగర్, సాయిబాబా నగర్, జై ప్రకాష్ నగర్, కైలాష్ నగర్ లలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు ప్రతి ఇంటా మంగళహారతులు పట్టి, ఇండ్ల పై నుండి పూలు చల్లుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మా సమస్యలు పరిష్కరించిన, మాకు అన్ని విధాలుగా అండగా నిలిచిన శ్రీనన్న కే మా ఓటు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులెత్తేశారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కూడా తప్పుడు హామీలతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ నాయకులు మోసపూరిత, అమలుకు సాధ్యం కాని హామీలను ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ని కాంగ్రెస్ నాయకులకే గ్యారెంటీ లేదు కానీ.. వారు చెప్పే గ్యారెంటీ లను ఎవరు నమ్ముతారని అన్నారు. ప్రజలు BRS ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నందున
ఖచ్చితంగా మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్నారు. మంత్రి వెంట కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాల్ రెడ్డి, డివిజన్ BRS అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ శేఖర్, మాజీ అధ్యక్షుడు ఖలీల్, నాయకులు బాల రాజ్, సరాఫ్ సంతోష్,నోమాన్, సురేష్ గౌడ్, కర్నాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రాజేష్, పుష్పాలత తదితరులు ఉన్నారు.