SAKSHITHA NEWS

నా పై కక్ష్యపురితంగా అసత్యపు వార్త కథనాలు ప్రచురించి రాజకీయ పబ్బం గడుపుకునే వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.*

మీరు ఆరోపించినట్టు నిరూపిస్తే ఆ 30 ఎకరాల భూమిని మీకు గాని మీ పత్రిక సంస్థ కు గాని తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధం

అసత్య వార్త కథనాలు రాసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా కేసు వేస్తామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు.

సీలింగ్ భూములు సమర్పయామి అంటూ ఓ గులామీ పత్రిక.. మాపై లేనిపోని అవాస్తవాలు.. అర్ధ సత్యాలు, అసత్యాలతో కూడిన ఓ కథనాన్ని వడ్డి వార్చింది. మాకు పత్రికలు, అన్నా మీడియా అన్నా గౌరవం ఉంది. కానీ కొందరు కావాలనే రాజకీయ లబ్ది కోసం మాపై బురదచల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఓ పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అసత్యం, అవాస్తవాలు అని వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని గౌరవ PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ నను రాజకీయంగా ఎదురుకోలేక నా పరవుకు భంగం కల్పించేలా అసత్య వార్తలు ప్రచురించిన వారి పై చట్టపరమైన ,న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. దాన్ని ఎవరు రాశారు. ఎందుకు రాశారు అనేది పక్కన పెడితే మేము 2000 సంవత్సరానికి ముందుగానే కుత్బుల్లాపూర్ మండలంలో మా కష్టార్జితంతో నేను రాజకీయాల్లోకి రాకముందే మా కష్టార్జితంతో అక్కడ స్థలాలు కొనుగోలు చేశాము. నా కుటుంబ సభ్యుల పేరు మీదుగా 4 ఎకరాలు మరియ ఇతరుల పేర్ల మీద 7 ఎకరాలు కొనుగోలు చేశాము. మొత్తం 11 ఎకరాలు క్లియర్ టైటిల్ ఉన్న భూమి ని మాత్రమే కొనుగోలు చేశాం .

నేను కొన్న ఏ ఒక్క భూమి ఎకరం స్థలం కూడా ప్రభుత్వ భూమి కానీ, ఈనాం స్థలాలు కానీ లేవు. అలాంటి భూములను కొనుగోలు చేసే అవసరం నాకు లేదు. కుత్భుల్లాపూర్ మండలంలో తానేదో ఈనాం భూములను, జాగీరు భూములను కొనుగోలు చేసి, ఇంకొన్ని భూములు కబ్జా చేసినట్టు గులాంగిరి పత్రిక చేసిన ఆరోపణలు నిజం అని తేల్చే దమ్ముందా.. మీరే ఆరోపణలు వినిపిస్తున్నాయని రాశారు. అంటే వాస్తవాలు కానివే ఆరోపణలు ఎవరికైనా అర్థం అయి ఉంటుంది.
రాజకీయాల్లోకి వచ్చాక నా నియోజకవర్గం అయిన శేరిలింగంపల్లిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను ఎక్కడైనా కనీసం గజం జాగా కూడా కబ్జా చేసినట్టు నిరూపించే దమ్ముందా.. నేను పార్టీ మారిందే భూ కబ్జాలను కప్పిపుచ్చుకునేందుకు అని రాశారు. నేను గత రెండు పర్యాయాలు, దాదాపు 9 సంవత్సరాల పాటు బీఆర్ ఎస్ పార్టీలోనే కొనసాగాను అప్పుడు అదే బీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎంతోమందిపై చాలా పత్రికల్లో భూ కబ్జాలకు సంబంధించిన వార్తలు కోకొల్లలుగా వచ్చాయి. నాపై ఎన్నడూ కబ్జాలకు సంబంధించిన వార్త అయినా వచ్చిన దాఖలాలు లేవు. కానీ నేను శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకోసం పార్టీ మారగానే నాపై గులాంగిరి పత్రికల అర్ధ సత్యాలు, అసత్యాలతో కూడిన వార్తలు రాపించారు. మీరు ఆరోపిస్తున్నట్టు నేను 30 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. ఆ భూమికి నాలా కన్వర్షన్ చేసి కొంతమేర అమ్మానని రాశారు. నేను ఆ 30 ఎకరాలలో కబ్జా చేసినట్టు మీకు నిరూపించే దమ్ముందా..మీరు ఆరోపించినట్టు నిరూపిస్తే ఆ 30 ఎకరాల భూమిని మీకు గాని మీ పత్రిక సంస్థ కు గాని తిరిగి ఇవ్వడానికి నేను సిద్ధం

లేదంటే మీరు రాసినవి అసత్యాలని ఒప్పుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలి. అలాగే మీతో ఎవరు ఎందుకు రాపించారో రాష్ట్ర ప్రజలకు వివరించాలి. లేదంటే మీపై మీ పత్రికపై పరువు నష్టం దావా వేసేందుకు ఏ మాత్రం వెనకాడబోమని స్పష్టం చేస్తున్నా. అసత్య వార్త కథనాలు రాసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, పరువు నష్టం దావా వేస్తామని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు.


SAKSHITHA NEWS