SAKSHITHA NEWS

గంగమ్మ తల్లీ ఆశీసులు ప్రతీ ఒక్కరికీ కలగాలి
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
*శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యెక పూజలు నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ *


*సాక్షిత : *తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల కు జాతర లు నిదర్శనం అని *కోదాడ అభివృద్ధి ప్రధాత ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ * అన్నారు అన్నారు.కోదాడలోని కొమరబండ గ్రామంలో శ్రీ శ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో *ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ * హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ప్రాంతాలు, వర్గాల వారీగా జరిగే జాతర లకు ప్రభుత్వ ప్రాధాన్యత లభించింది అన్నారు.

మతాలకు అతీతంగా ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించడం అనేది తెలంగాణ లో మినహా మరెక్కడా లేదన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని ఆయన అన్నారు.దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉండేలా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నారు.దేవాలయాల అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సంపేట ఉపేందర్ గౌడ్, మామిడి రామారావు, సీతయ్య, వీరబాబు,బత్తుల కిట్టు, నాగేశ్వరావు, సర్వయ్య, వెంకన్న, కొర్ర పిడతల నాగరాజు, అఖిల్, లింగరాజు, సైదులు, యాదవ కుల పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS