చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలి.
- జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చదువుతోనే అభివృద్ధి సాధ్యమని ఎంచుకున్న రంగాలలో నైపుణ్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. గురువారం ఖమ్మం నగరం టేకులపల్లి మహిళా ప్రాంగణంను జిల్లా కలెక్టర్ సందర్శించారు. శిక్షణ పొందుతున్న విద్యార్థీనిలతో కలెక్టర్ మాట్లాడి ప్రాంగణంలో పొందుతున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. శిక్షణకు సంబంధించిన ప్రశ్నలు అడిగి విద్యార్థినిల నుండి సమాదానాలు రాబట్టారు. వారు చెప్పిన సమాదానాలతో సంతృప్తి చెందారు. నర్సింగ్, కంప్యూటర్, టైలరింగ్‌లలో వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులకు జిల్లా ప్రాంగణం అధికారి సమకూర్చిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకు అందించిన పుస్తకాలను ప్రతిరోజు చదవాలని వాటిలోని పరిజ్ఞానాన్ని పెంపొందించుకొవాలన్నారు. ఉన్నతంగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని, ఇక్కడ కల్పిస్తున్న సౌకర్యాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో వృత్తి శిక్షణలో నైపుణ్యం సాధించడం ద్వారా ఉపాధి అవకాశాలు సులభతరమవుతాయన్నారు. టైలరింగ్‌లో చక్కని ప్రావిణ్యత కనబరిచిన విద్యార్థులకు అత్యాధునిక కుట్టుమిషన్లు అందిస్తామని, కంప్యూటర్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ఇద్దరికి ల్యాప్టాప్స్ బహుమతిగా ఇస్తామని విద్యార్థినిలను ఉత్తేజపరిచారు. అదేవిధంగా నర్సింగ్ విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్థాయని చెప్పారు. మన జిల్లాకు వైద్య కళాశాల మంజూరు అయిన సందర్భంగా నర్సింగ్ కోర్సు అభ్యసించిన విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయని వారి ప్రతిభ ఆధారంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలు చేపడతామని తెలిపారు. ఏ.ఎన్.ఎమ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందించారు.
ఈ సందర్భంగా ప్రాంగణంలోని అన్ని గదులను, ఆవరణను పరిశీలించి పచ్చదనం. పరిశుభ్రత, రిసెప్షన్ కౌంటర్, షోకేసుల నిర్వహణ పట్ల ప్రాంగణం అధికారిని కలెక్టర్ అభినందించారు. ఇదే తరహాలో ప్రాంగణంను అభివృద్ధి చేయాలని, మరిన్ని కొత్త కోర్సులను తీసుకురావాలని, దానికి అసవరమైన సహాయ సహాకారాలు తప్పకుండా అందిస్తామని కలెక్టర్ తెలిపారు.
కార్యక్రమంలో ప్రాంగణం అధికారి వేల్పుల విజేత, సిబ్బంది నాగసరస్వతి, హిమబిందు, స్పందన, మల్లిక్, రమేష్, విజయకుమార్, వెంకటేశ్వర్లు, దుర్గారావు, శాంతమ్మ, కళ్యాణి, ఏ.ఎన్.ఎమ్ బోధన సిబ్బంది లాలయ్య, సుకన్య, మంజుల, టైలరింగ్ సిబ్బంది ఆరుణ, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ షానాజ్ తదితరులు పాల్గొన్నారు.