SAKSHITHA NEWS

TSPSC ప్రశ్నా పత్రం లీకేజ్ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి – మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రం లీకేజి సంఘటనకు నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు గండిమైసమ్మ చౌరస్తా లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాము గౌడ్ ల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. మంత్రి కేటీఆర్ ని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
తొమ్మిదేళ్లలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారు.. వాటిని కోర్టుల్లో కేసులు వేయించి లిటిగేషన్లు పెట్టారని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణాను సుక్క, ముక్క తెలంగాణ గా మార్చారని ప్రభుత్వం పై మండిపడ్డారు. ఏళ్లకు ఏళ్లుగా హాస్టల్ లలో, రూమ్ లలో ఉంటూ, ఒక పూట తిని, ఒక పూట తినక కోచింగ్ లు తీసుకుంటున్న నిరుద్యోగుల జీవితాల ఆశల్లో నీళ్లు పోసారని, గ్రూప్ – 1 లో నిజాయితీగా, కష్టపడి చదివి క్వాలిఫై అయిన ఇరవై ఐదు వేల మంది పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ముప్పై లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయని, వారి తల్లిదండ్రుల ఉసురు బీఆర్ఎస్ నాయకులకు తగులుద్దని అన్నారు.రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు గాలిలో పెట్టిన దీపం లెక్క తయారయినయని, ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని నిలదీయాలి.. ప్రశ్నా పత్రం లీకేజి ఘటన పై స్పందించాలని డిమాండ్ చేసారు.రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ పై నమ్మకం లేదని, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని అన్నారు.ప్రశ్నా పత్రం లీకేజ్ ఘటన పై నైతిక భాద్యత వహించి కేటీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా. ఎస్ మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మూగ జయశ్రీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, రూరల్ జిల్లా ప్రదాన కార్యదర్శి విగ్నేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు గరిగె శేఖర్, రాజిరెడ్డి, బావిగడ్డ రవి, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి మేకల సురేష్ రెడ్డి, నిజాంపేట్, కొంపల్లి, దుండిగల్ పురపాలకల బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్, జనార్దన్ రెడ్డి, మల్లెష్ యాదవ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు అర్కల సుధా, సరిత, ఎస్టీ మోర్చా జిల్లా నాయకులు దాసరి శ్యామ్ రావ్, రాంచందర్ నాయక్, ఎస్సి మోర్చా నాయకులు దాసి నాగరాజు, సీనియర్ నాయకులు సుమన్ రావ్, డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, పున్నా రెడ్డి, పత్తి సతీష్, దుర్యోధన్ రావ్, కంది శ్రీరాములు, రాజేశ్వర్ రావ్, పులి బలరాం, బౌరంపేట్ కౌన్సిలర్ బాలమణి – కృష్ణ రెడ్డి, డివిజన్ ఇంచార్జులు సుశాంత్ గౌడ్, కృష్ణ యాదవ్, బీజేవైఎం అసెంబ్లి కన్వీనర్ సాయిరాం రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వారాల మహేష్, కార్యదర్శి జూల సందీప్, దుండిగల్ మున్సిపల్ బీజేవైఎం అధ్యక్షులు ఆకుల విజయ్ సాయి, నాయకులు చండి శ్రీనివాస్, ఏర్వ వెంకట్, సంగీత పాత్ర, అలివేలు, రోజా, కుమ్మరి శంకర్, అరుణ్ కుమార్, దుండిగల్ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి నర్సింహా చారి, శ్రీనివాస్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS