పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
-ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి, సాక్షిత : అనపర్తి నియోజకవర్గం అనపర్తిలో రామారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో మరియు అనపర్తి సావరం లలో మిషన్ హరితాంధ్రప్రదేశ్ “వనo -మనం” కార్యక్రమాన్ని ఎన్డియే నాయకులు, అధికారులతో కలిసి శుక్రవారం అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలు యువత భాగ్యస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడం తో పాటు వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పర్యావరనాన్ని పరిరక్షించడానికి ప్రతీ ఒక్కరూ తమ వంతు భాద్యత గా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డియే నాయకులు, అనపర్తి టౌన్, అనపర్తి సావరం ఎన్డియే నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గోన్నారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
Related Posts
జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం.
SAKSHITHA NEWS జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడదాం. కమిషనర్ ఎన్.మౌర్య జనావాసాల్లోకి వన్యప్రాణులు రాకుండా చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. కరకంబాడి మార్గంలోని బయోట్రిమ్, ఫారెస్ట్ నుండి వన్యప్రాణులు ఉపాద్యాయ నగర్ లోనికి వస్తున్నాయని ప్రజా…
మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.
SAKSHITHA NEWS మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.కమిషనర్ ఎన్.మౌర్య సాక్షిత : నగరంలో ఉత్పన్నమయ్యే మురుగునీరు డ్రెయినేజీ కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఉదయం 14 వ డివిజన్…