వికారాబాద్ జిల్లా:
బాలికల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి , వికారాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలలో ఆమె పాల్గొన్నారు
బాల్యవివాహాలు నిర్మూలించి బాలికలపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి పేర్కొన్నారు, తల్లిదండ్రులు లింగ అసమానతలు చూపకుండా బాలుర తో పాటు బాలికలను కూడా ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు, వికారాబాద్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ వేడుకలకు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమని ఆమె ప్రారంభించారు, బాల్యవివాహాలను అరికట్టెందుకు తమ వంతుగా కృషి చేస్తామంటూ మత పెద్దలు పురోహితులు, పాస్టర్లు , ఖజ్వి లు, విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు, బాల్య వివాహాలు అరికట్టేందుకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చామని ఆమె తెలిపారు, బాల్యవివాహాలు చేసిన చేయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు, బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు, బాలికలు ఉన్నత చదువులు చదివినప్పుడే స్త్రీ సాధికారత సాధ్యమవుతుందని బాలికలు చదువును అశ్రద్ధ చేయకుండా చదువులో రాణించాలని విద్యార్థినిలకు ఆమె సూచించారు
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.