SAKSHITHA NEWS

ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి

-సర్పంచ్ల ఫోరం కార్యదర్శి కాయిత రాములు

……..

సాక్షిత : సైదాపూర్ మండలం

సైదాపూర్ మండలం లసమన పల్లి లో గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని సర్పంచ్ల ఫోరం ప్రధాన కార్యదర్శి కాయిత రాములు కోరారు. భారత స్వాతంత్ర స్వర్ణోత్సవాల్లో భాగంగా గ్రామంలోని భూలక్ష్మి వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశభక్తి అంటే జాతీయ జెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకోవడం తో పాటు సాటి మనిషిని గౌరవించినప్పుడే మనకు దేశభక్తి ఉన్నట్టని ఆయన పేర్కొన్నారు.మన దేశం లౌకిక దేశమని అన్ని మతాలను,కులాలను గౌరవించాలని అప్పుడే దేశం ముందుకు పోతుందని తెలిపారు. స్వాతంత్ర స్వర్ణోత్సవాల్లో భాగంగా ఇప్పటివరకు చేపట్టిన జాతీయ జెండాతో ర్యాలీ, క్రీడా పోటీలు, చెట్లు నాటడం, సామూహిక జాతీయ గీతాలాపన, జాతీయ పతాకాల పంపిణీ, రక్తదానం చేయడం, ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. భారత స్వాతంత్ర సర్వోత్సవాలు ఈనెల 22 తో ముగుస్తుందని పేర్కొన్నారు. దేశభక్తి ప్రతిబింబించేలా వేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న యువతులను, మహిళలను ఆయన అభినందించారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న యువతులకు, మహిళలకు సర్పంచ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి ,వార్డు సభ్యులు రేగుల సురేష్ ,వివో ఏ శ్రీలత, యువతులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS