SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

ప్రతీ యువకుడు రక్తదాతలుగా మారాలి ప్రణాలను కాపాడాలి :-చల్లా.అశోక్ రెడ్డి

గిద్దలూరు మరియు వివిధ ప్రాంతాల్లో ఉండే యువతకు అందరికీ నమస్కారం ఎండాకాల ఉష్ణోగ్రత తీవ్రత అధికంగా ఉన్న కారణంగా రక్తదాతలు దొరకక చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

ముక్యంగా గర్భిణీ మహిళలు,తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు, రామధల్లో గాయపడిన వారు, అత్యవసర ఆపరేషన్లు చేయించుకునే రోగులు ఇలా ఎంతోమంది ఎన్నో అవస్థలు పడుతున్నారు.

తీవ్ర ఎండలు ఉండటం కారణంగా రక్తదాతలు రక్తదానం చేయడానికి సంకోచిస్తూ ఉంటారు దయచేసి ఎలాంటి అపోహలు,సందేహాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ప్రతి ఒక్కరు కులమతాలకతీతంగా పార్టీలకు అతీతంగా మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్, లేదా ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ నందు స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము.

వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న రోజులు రక్తదాతలు దొరకక రక్త నిల్వల (బ్లడ్ బ్యాంక్) చుట్టూ అవస్థలు పడుతూ తిరుగుతూ ఉన్నారు.

ప్రతి ఒక్కరికి ఈ అవకాశం మంచి సేవా కార్యక్రమం కాబట్టి మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు దయచేసి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి
రక్తదాత సుఖీభవ
స్వచ్ఛందంగా రక్తదానం చేయాలనుకున్న వాళ్ళు ఈ కింది నంబర్లకు కాల్ చేయండి

చల్లా.అశోక్ రెడ్డి
మేమున్నాం సేవాసమితి 9959954610


SAKSHITHA NEWS