SAKSHITHA NEWS

దినేష్ రెడ్డిని ఆశీర్వదించండి

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.

సాక్షిత : కోవూరు నియోజకవర్గ విడవలూరు మండలం సేవకు మించిన భాగ్యం లేదని ప్రజలకు సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లేనని ఆ సేవా కార్యక్రమాల ద్వారా తనకు ఇంత పేరు ప్రతిష్టలు వచ్చాయని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు,విడవలూరు మండలం, ముదివర్తి పంచాయితీ పరిధిలోని చెలికల, గాంధీ నగర్ గ్రామాలలో వి పి ఆర్ ఫౌండేషన్ సహకారంతో వి.పి.ఆర్‌ అమృత ధార ద్వారా ఏర్పాటు చేసిన వాటర్‌ ప్లాంట్లను స్థానిక టిడిపి నాయకుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో కోవూరు టిడిపి ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి తో కలిసి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు,ముందుగా ముదివర్తి గ్రామానికి చేరుకున్న వారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు,గజ మాలతో ఘనంగా సత్కరించారు, అక్కడి నుంచి చెలికల గ్రామానికి చేరుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన వి.పి.ఆర్‌ అమృత ధార వాటర్‌ప్లాంట్‌ ను ప్రారంభించారు,అదే గ్రామంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు,అక్కడి నుంచి ముదివర్తికి చేరుకునీ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఉన్న శ్రీ రామ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. 2017 నుంచి నిరంతరం ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్లాంట్ల నిర్వహణ కూడా ఫౌండేషన్ తరఫునే చేస్తామన్నారు, గ్రామస్థులు ఇందుకు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు,వచ్చే ఎన్నికల్లో తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తప్పకుండా మీ అందరి మద్దతు కావాలన్నారు. మీ అందరి సహకారంతో ఎంపీగా గెలిచిన వెంటనే గ్రామాల్లో మా వంతు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వివరించారు,అభివృద్ధి కార్యక్రమాలు చేసేదాంట్లో ఎక్కడా వెనకడుగు వేయమని స్పష్టం చేశారు,ఈకార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, కో-ఆప్టెడ్ సభ్యులు రఫీ, బెజవాడ గోవర్ధన్ రెడ్డి పురంధర్ రెడ్డి, ముదివర్తి ఉప సర్పంచి శరత్‌ చంద్ర, గానుగపెంట శ్రీనివాసులురెడ్డి, ఖలీమ, పద్మ, పట్టపు జ్యోతి, వెంకయ్య, మాధవి, దామేగుంట వెంకట శేషారెడ్డి, అనీఫ్ సీతారామయ్య దయాకర్ వెంకయ్య దానయ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 13 at 7.07.04 PM

SAKSHITHA NEWS