SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 14 at 3.47.40 PM

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ కాలనీ లో రూ. 35.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు GHMC ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా ఆల్విన్ కాలనీ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ ఈ రోజు HMT శాతవాహన నగర్ కాలనీ లో సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని ,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు AE శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ మరియు ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS