SAKSHITHA NEWS

Estimated cost of Rs 30.00 Lakhs in Nagarjuna Homes, Jampet Road

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్, నాగార్జున హోమ్స్ లో 30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న సి సి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు ు మాట్లాడుతూ, సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR మరియు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సహకారం తో హైదర్ నగర్ డివిజన్ ను, అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతానని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత, సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నార్నె శ్రీనివాసరావు అధికారులను ఆదేశించడం జరిగినది.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,

డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి
ఏ ఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, నాగార్జున హోమ్స్ నివాసితులు వెంకట రత్న కుమార్, కడియాల శివ, శ్యామ్, పి ఎస్ కే వర్మ, బాలకృష్ణ, డి ఎస్ రాజు, సోమ రాజు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS