SAKSHITHA NEWS


Estimated cost of Rs.18 lakhs in Janapriya West City Colony

మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ కాలనీ లో రూ.18 లక్షల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జనప్రియ వెస్ట్ కాలనీ లో ఓపెన్ జిమ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.ఇందులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం ,సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు ,పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని, శారీరక శ్రమ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లు చాలా ఉపయోగపడుతాయి అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు,

పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగినది అని. అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.


రాబోయే రోజులలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేసి, ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించే దిశగా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతున్నదని , ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామలు చెయ్యటం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని,

ఆరోగ్యమే మహా భాగ్యం అని, కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఓపెన్ జిమ్ లకు విపరీతమైన ఆదరణ లభించటం ఎంతో సంతోషదాయకమని మరిన్ని కాలనీ లలో ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో జనప్రియ వెస్ట్ కాలనీ అధ్యక్షులు సత్యనారాయణ, సెక్రటరీ గోవర్ధన్, సోమిరెడ్డి, ఇమ్మానుయేల్, భాస్కర్ రావు, ఇన్నారెడ్డి, మల్లికార్జున్, ప్రదీప్, రామలింగం, రామకృష్ణ, నర్సింలు మరియు కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS