సాక్షిత * : జాతీయ రహదారి NH 65 ప్రధాన రహదారి పై BHEL చౌరస్తా లో రూ. 130.65 కోట్ల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం లో భాగంగా జరుగుతున్న సర్వీస్ రోడ్డు విస్తరణ మరియు వరద నీటి కాల్వల నిర్మాణం పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజసౌకర్యార్థం నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణము పనులను వేగవంతం చేయాలని, వరద నీరు కాల్వ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ,వర్షాకాలం ను దృష్టిలో పెట్టుకొని పనులలో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని , నిత్యము ప్రయాణికులతో రద్దీగా ఉండే జాతీయ రహదారి కావడం ప్రజలకు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి అని ,ప్రజలకు, వాహనదారులకు ,స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ,ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడలని,ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని, నిర్మాణం జరుగుతున్న సమయంలో వ్యర్థాలను వెంటనే తరలించాలని ,మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని, సర్వీస్ రోడ్డు లో పనులు త్వరితగతిన పూర్తి చేయాలి, ప్రజలకు ఎటువంటి ఇబ్బది కలగకుండా అప్రోచ్ రోడ్లు ను వెంటనే పునరుద్ధరించాలని , సర్వీస్ రోడ్డు లో తీసిన గోతుల చుట్టూ రక్షణ వలయాలను ఏర్పాట్లు చేయాలని, ప్రమాదాల నివారణ కై రక్షణ వలయాలు ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా అన్ని రకాల రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. సర్వీస్ రోడ్డు లో షాప్ ల సముదాయం ముందు తీసిన గోతుల చుట్టూ రక్షణ చర్యలు తీసుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, ఫ్లై ఓవర్ నిర్మాణం పై అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది అని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి సుఖవంతమైన ప్రయాణం కు బాటలు వేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, మల్లేష్ గుప్తా, గురుచరణ్ దుబే, రాజశేఖర్ రెడ్డి, నరేందర్ బల్లా,యశ్వంత్ అమిత్, అంజద్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు