SAKSHITHA NEWS

Estimated cost of Nagarjuna Homes Colonies is Rs.2 Crores and Rs.10 Lakhs

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, నాగార్జున హోమ్స్ కాలనీలలో రూ.రూ 2 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపట్టబోయే పార్క్ సుందరికరణ మరియు అభివృద్ధి పనులకు మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివుద్ది ఆగకూడదనే ఉద్దేశ్యం తో సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం లో మంత్రి KTR సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,

అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ సమత నగర్ లో గల రాక్ గార్డెన్స్ పార్క్ ను 180 లక్షల రూపాయల తో పార్క్ చుట్టూ ఫెన్సిగ్, వాకింగ్ ట్రాక్, కార్యలయం తో పాటు అన్ని హంగులతో ,సకల సౌకర్యాల తో అభివృద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని, పిల్లలకు, వృద్దులకు వాకింగ్ మరియు ఆట స్థలం లకు ఉపయోగకరమైన వాతావరణం కలిపిస్తామని

కాంక్రీట్ కి కారణ్యంలో పార్క్ లు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయి అని, పార్క్ లను అన్ని రకాల మౌలిక వసతుల తో, అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో సుందర శోభిత వనాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా నాగార్జున హోమ్స్ లో 30 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, శంకుస్థాపన చేసుకోవడం చాల సంతోషకరం అని అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని

,సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, సీసీ రోడ్ల నిర్మాణం పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు

అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పడం జరిగినది. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని

,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు…

  1. సమంత నగర్ కాలనీ లో రూ.1.80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే రాక్ గార్డెన్ పార్క్ సుందరికరణ అభివృద్ధి నిర్మాణ పనులకు
  2. నాగార్జున హోమ్స్ లో రూ.30.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది.

పైన పేర్కొన్న పార్క్ అభివృద్ధి మరియు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్


SAKSHITHA NEWS