SAKSHITHA NEWS

దేశ రాజధాని ఢిల్లీలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి , ఎంపీ రాములు తో కలిసి సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ సంజయ్ కుమార్ కి గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ విద్యాలయం మరియు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం అందజేశారు.

గద్వాల నియోజకవర్గంలో విద్యభివృద్ధికి జాతీయ విద్యా సంస్థలైన కేంద్రీయ విద్యాలయంను మల్దకల్ మండలంలో మరియు జవహర్ నవోదయ విద్యాలయంను కేటీ దొడ్డి మండలంలో ఏర్పాటు చేయాలనీ గద్వాల తాలూకా విద్యాభివృద్ధిలో వెనుకబడి ఉంది అని వెనుకబడడానికి కారణం సరైన విద్యా సంస్థలు అందుబాటులో లేనందున సరైన విద్యా ప్రమాణాలను మా నియోజకవర్గ విద్యార్థులు అందుకోలేక పోతున్నారని అందుచేత జాతీయ స్థాయిలో రాణించలేకపోతున్నారని కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసి విద్యభివృద్ధికి తొడ్పాటును అందించాలని కోరారు ఇందుకు గాను సెక్రటరీ సానుకూలంగా స్పందించడం జరిగింది.

WhatsApp Image 2024 02 05 at 6.16.19 PM

SAKSHITHA NEWS