SAKSHITHA NEWS

నల్లగొండ సాక్షిత

నల్లగొండ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో తెలంగాణ హరితోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల బాగంగా జిల్లా యస్.పి అపూర్వ రావు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో తెలంగాణ హరిత దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ కె. ఆర్.కె ప్రసాద రావు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చెట్లను పెంచడం ద్వారా మానవాళికి ఎంతో దోహదడుతుందన్నారు. (వృక్షో రక్షతి,రక్షిత) చెట్లను మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి ప్రాణవాయువు పెంచి వాతావరణాన్ని కాపాడుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐలు,ఆర్ ఐలు, యస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS