SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జమాఅతె ఇస్లామీహింద్ జాతీయ అధ్యక్షులుగా ఇంజనీర్ సాదతుల్లాహుసైనీ మరోసారి ఎన్నికయ్యారు. ఢిల్లీలో గురు, శుక్ర వారాల్లో జరిగన కేంద్ర ప్రతినిధుల సభలో ఈ మేరకు ఆయన్ను ఎన్నుకున్నారు. 2023-2027 వరకూ నాలుగేళ్లపాటు ఆయన బాధ్యతలను నిర్వర్తిస్తారు. హైదరాబాద్ కు చెందిన సాదతుల్లాహుసైనీ ఎస్ఐవో విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షులుగానూ గతంలో సేవలందించారు. ఎన్నో పుస్తకాల రచయితగా, ఇస్లామిక్ స్కాలర్ గా, మంచి వక్తగా సాదతుల్లాహుసైనీకి మంచి పేరుంది. ఆయన ఎన్నికపట్ల జమాఅతె ఇస్లామీహింద్ సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


SAKSHITHA NEWS