SAKSHITHA NEWS

మధిర పట్టణంలో కబ్జాల జోరు వక్ఫ్ బోర్డ్ స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు

-మధిరలో వరుస కబ్జాలతో చర్చనీయాంశంగా మారిన విషయాల్లో ఇది కూడా ఒకటి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

మధిర పట్టణం నడిబొడ్డున రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ముకరం జాహి మస్జిద్ కి చెందిన కోట్ల విలువ చేసే వక్ఫ్ బోర్డ్ స్థలంపై కబ్జా కోరుల కన్ను పడింది. ముత్తాతలనాటి వారసులమంటూ మధిర మున్సిపాలిటీలో దొంగ చాటుగా యల్ ఆర్ ఎస్ తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. మధిర పట్టణంలో ముస్లిం సోదరులు ముక్రం జాహి మజీద్ కు చెందిన స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.. అట్టి స్థలాన్ని కొందరు వ్యక్తులు దొంగ చాటుగా ఆ స్థలానికి కబ్జా చేయటం కోసం దొంగ పత్రాలు సృష్టించి మధిర మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని తెలుసుకున్న మధిర పట్టణ ముస్లిం సోదరులు, ముక్రం జాహి మజీద్ కమిటీ అధ్యక్షుడు అస్మతుల్లా మరియు కమిటీ సభ్యులు గురువారం మధిర మున్సిపాలిటీ కార్యాలయం నందు మధిర టౌన్ ప్లానింగ్ అధికారిని కలిసి ఈ మసీదుకు సంబంధించిన స్థలాలు కేవలం తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి స్థలాలుగా తెలియపరచి వాటికి సంబంధించిన రాజపత్రాన్ని మరియు వివిధ కోర్టులలో నడుస్తున్న కేసు వివరాలను టౌన్ ప్లానింగ్ అధికారికి ఇవ్వడం జరిగినది. ఇట్టి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు తెలిపారు..


SAKSHITHA NEWS