ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియచేయునది ఏమనగా
తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం నూతనంగా ప్రారంభించినటువంటి గృహలక్ష్మి పథకం కొరకు అర్హులైన వారి నుండి దరఖాస్తులను మండల తహసీల్దార్ కార్యలయం లో గాని ,ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయం లో స్వీకరించడం జరుగుతుంది.
ఇట్టి దరఖాస్తులకు 09/08/2023 నాడు నుంచి 10/08/2023 వరకు మాత్రమే ఇవ్వగలరు.
దరఖాస్తుతో జత చేయవలసినవి.
- రెండు పాస్ ఫోటోలో
- ఆహార భద్రత కార్డు
- ఓటర్ కార్డు
- ఆధార్ కార్డు
- ఇంటి స్థలం యొక్క దస్తావేజులు
- ఇంటి పన్ను రసీదు
- కరెంట్ బిల్లు రసీదు
- బ్యాంకు బుక్ జిరాక్స్
మొదలైనవి జత చేసి ఇవ్వవగలరని మనవి.
కావున అర్హులైన వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి గృహ లక్ష్మీ పథకం ను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.
ఇట్లు
ఆరెకపూడి గాంధీ ,ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే శేరిలింగంపల్లి నియోజకవర్గం క్యాంప్ కార్యలయం