చిట్యాల సాక్షిత ప్రతినిధి
వెలిమినేడు పాల ఉత్పత్తి దారుల సహకార సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని సంఘం డైరెక్టర్లు డిమాండ్ చేశారు.
చిట్యాల మండలంలో వెలిమినేడు గ్రామంలో నల్లగొండ- రంగా రెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకర సంఘం రైతు పాల సంఘం ఎన్నికలను బైలా ప్రకారము పాత కమిటీ గడువు పూర్తయిన ఎన్నికలు నిర్వహించకపోవడం తో సంఘం డైరెక్టర్లు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సంఘం కార్యదర్శి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరము పలువురు డైరెక్టర్లు మాట్లాడుతూ ప్రస్తుత చైర్మన్ మొండివైఖరి వల్ల ఎన్నికల నిర్వహణ జరగడం లేదని కార్యాలయంలో ఉండాల్సిన రికార్డులన్నీ దౌర్జన్యంగా తీసుకెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో పాల సంఘం ఎన్నికల నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ, పాలసంఘం మాజీ చైర్మన్ కర్ధురి మల్లా రెడ్డి,డైరెక్టర్లు మారగోని యాదయ్య,దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడగొని అంజయ్య,ఏర్పల నర్సింహా, మద్దెపురం లింగస్వామి, ఏనుగు చంద్రకళ,రైతులు చీమల శ్రీనివాస్,ఉంగరాల పటేల్,ఆరూరి శoభయ్య, నేలికంటి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.