రేషన్ పంపిణీ వ్యవస్థలో కూడా వాలంటీర్లకు దూరం
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలవుతున్న కారణంగా వాలంటీర్ల విధులు పై పరిమితులు విధిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
జారీ చేసిన ఉత్తర్వులలో ముఖ్య అంశాలు:
1) ఎన్నికల ప్రవర్తన నియమావలిని దృష్టిలో ఉంచుకొని గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ విభాగంలోనూ పాలుపంచుకోకూడదు.
2) వాలంటీర్స్ పేరిట ఉన్న బయోమెట్రిక్ authentication ఎన్ఐసి నిలిపివేస్తుంది. వారి స్థానాల్లో వీఆర్వోలు మ్యాపింగ్ చేస్తారు.
3) కాబట్టి ఎక్కడైనా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేసెస్ ఉంటే విఆర్ఓ authentication తో పూర్తి చేయాలి.
4) ఎండియు ఆపరేటర్స్ కూడా వాలంటీర్లను ప్రజా పంపిణీ వ్యవస్థకు పిలువరాదు.
5) వీఆర్వోల authentication ప్రయత్నించే ముందు ఐరిష్ (IRIS) మరియు ఫ్యూజన్ ఫింగర్ ప్రయత్నించాలి.
ఈ నియమావళిని అందరూ తప్పక నేటి నుంచి జరుగు రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాటించాలి. ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.