SAKSHITHA NEWS

Education is the foundation of children’s future and recognition in the society

చదువుతోనే సమాజంలో గుర్తింపు బిడ్డల భవిష్యత్ కు విద్యే పునాది
ఆజాద్ రచనలతో సమాజం ప్రభావితం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సముచిత స్థానం
జాతీయ విద్యా దినోత్సవంలో ఎంపీ నామ నాగేశ్వరరావు

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఉన్నత చదువులు చదివించి, వారి బంగారు భవిష్యత్ కు గట్టి పునాది వేయాలని టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని తెలంగాణా మైనార్టీస్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్ట్యూషన్స్ సొసైటీ (టిఎంఆర్ఇఐఎస్) విద్యా సంస్ధలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ నామ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

తొలి ఉప రాష్ట్రపతి, భారత రత్న అవార్డు గ్రహీత మౌలానా అబ్ధుల్ కలాం ఆజాద్ పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. నెహ్రూ క్యాబినెట్లో తొలి విద్యా శాఖా మంత్రిగా పని చేసి, తన రచనల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప మహనీయుడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీస్ కు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించడం ఒక చరిత్ర అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి, వారి పిల్లలు విద్యాభివృద్ధికి సమున్నత స్థానం కల్పించారని అన్నారు.

రాష్ట్రంలో మైనార్టీలకే కాకుండా బడుగు, బలహీన వర్గాల వారి పిల్లల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. వెనుకబడిన వర్గాల జీవితాల్లో కేసీఆర్ నూతన వెలుగులు నింపుతున్నారని అన్నారు. విద్యా పరంగా పడే పునాదే భవిష్యత్లో సమాజంలో మంచి గుర్తింపును, గౌరవాన్ని తీసుకువస్తాయని తెలిపారు. ఉన్నతమైన ఆశయంతో చదివే విద్యనే మన ఆర్ధికాభివృద్ధికి మార్గాన్ని నుగామం చేస్తుందన్నారు.

మనం ఎంత ఎదిగినా చదివే మనకు ఉన్నత విలువలు, మహోన్నత స్థానాన్ని కల్పించి, గుర్తింపును తీసుకువస్తుందన్నారు. ప్రపంచంలో ఒక్క విద్యకే గుర్తింపు ఉందని, మరేదానికి అంత గుర్తింపు లేదని అన్నారు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా తనకు ఇంకా చదువుకోవాలని కోరిక మెండుగా ఉందంటూ తన చిన్ననాటి విశేషాలను పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నామ పంచుకున్నారు.

ఇనిస్ట్యూషన్ ఉపాధ్యాయులు, సిబ్బంది పిల్లల్ని తమ సొంత బిడ్డల్లా చూసుకుని, ఉన్నతులుగా క్రమశిక్షణతో పెంచడం ఎంతో అభినందనీయమని నామ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల కోసం 204 స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు.

మైనార్టిస్ విద్యాసంస్థలే కాకుండా యావత్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడడం వల్ల విద్యా పరంగా కూడా మనం దూనుకుపోతున్నామని అన్నారు. అన్ని చోట్ల మౌళిక వనతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, టీఆర్ఎన్ జిల్లా అధ్యక్షులు తాతా మధు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పార్టీ వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, తెలంగాణ మైనార్టీన్ రెసిడెన్షియల్

స్కూల్స్, కాలేజెన్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విజిలెన్స్ ఆఫీసర్లు జమీల్ పాష, సీతారాములు, రీజినల్ కో ఆర్డినేటర్ అరుణకుమారి, ప్రిన్సిపల్ అబిదా సాల్మ్, రఘనాధపాలెం మెడికల్ ఆఫీసర్ పి. ఉషారాణి తో పాటు నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు ,కృష్ణ ప్రసాద్, సంస్థ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ నామ ను స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది శాలువతో సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సిబ్బందికి నామ జ్ఞాపికలను అందజేశారు.


SAKSHITHA NEWS