తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ శేరిలింగంపల్లి, బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో జరిగిన “విద్యా దినోత్సవం”
సాక్షిత : కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మొక్కలు నాటి విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్ లను అదేవిధంగా ఇటీవల ప్రకటించిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .*
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ & కాలేజ్ శేరిలింగంపల్లి, బాలానగర్ బాయ్స్-1 మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో “విద్యా దినోత్సవం” జరుపుకోవడం చాలా సంతోషకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’ – ‘మన బస్తి-మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకున్నాయి అని. తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని పేర్కొన్నారు. అదేవిధంగా 1,002 గురుకుల పాఠశాలల్లో 5,99,537 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నదని, ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి 1 లక్షా 25 వేల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తున్నదని సర్కారు బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మన ఊరు-మన బడి, మన బస్తి – మన బడి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వాటి రూపురేఖలే మార్చేస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో “ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం”తో పేద విద్యార్థుల విదేశీ విద్య కల సాకారం అయ్యిందని ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫారాలు అందజేస్తున్నామని. అదేవిధంగా 1 వ తరగతి నుండి 5 తరగతి వరకు విద్యార్థులకు ఉచిత వర్క్షీట్లు మరియు 6 వ తరగతి నుండి 10 తరగతి విద్యార్థులకు ఉచిత నోట్బుక్లు పంపిణీ చేయడం జరిగిందని. అదేవిధంగా పాఠశాల టాపర్లు, 10 మంది ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, ఐదుగురు ఉత్తమ తల్లిదండ్రులు, ఐదు ఉత్తమ పాఠశాల నిర్వహణ కమిటీలను శాలువాతో సత్కరించించి వారికీ బహుమతులను అందజేయడం జరిగిందని ఈ సందర్బంగా నార్నె శ్రీనివాస రావు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కల్పన, చందర్ రెడ్డి, కోర్డినేటర్ అనిల్ కుమార్, సమిఉద్దిన్, రాజేందర్ రెడ్డి, శైలజ, జ్యోతి, జూనియర్ లెక్చరర్లు, పాఠశాల నిర్వహణ కమిటీ విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.