డీల్లీ: లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా సమన్లు పంపుతోంది.ఈ క్రమంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు చెందిన పలు ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టింది. జల్ బోర్డు మాజీ సభ్యుడు శలబ్ కుమార్‌తో పాటు ఆప్‌తో సంబంధం ఉన్న పలువురికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు
Related Posts
స్పీకర్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు
SAKSHITHA NEWS న్యూఢిల్లీ : వక్ఫ్ బిల్లు సవరణలపై విచారణ చేపడుతున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ నుండి తాము వైదొలగనున్నట్లు ప్రతిపక్ష ఎంపిలు సోమవారం లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. సమావేశ తేదీలు, సంప్రదింపుల కోసం సమన్లు జారీ చేసే అంశాల్లో…
ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే..!!
SAKSHITHA NEWS ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే..!! న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన హామీలు ఇవ్వబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ ఆధారంగా మాత్రమే హామీలు ప్రకటించాల్సిన అవసరం…