SAKSHITHA NEWS

Durga Virinchi Multi Specialty Hospital on the occasion of World Diabetes Day

వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా దుర్గ విరించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత ఆరోగ్య పరీక్షలు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం నగరంలోని ఎన్ ఎస్ టి రోడ్,బాలాజీనగర్ నందు గల దుర్గ విరించి మల్టీ స్పెషాలిటీ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ లో డా.గుదిగొండ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది..

ఈ సందర్భంగా డా.కిరణ్ కుమార్ మాట్లాడుతూ…ఖమ్మం నగరంతో పాటు పలు జిల్లాలలోని డయాబెటిక్,కార్డియాలజీకి సంబందించిన రోగులు 200 వందల మంది వరకు వచ్చారని వీరి అందరికీ షుగర్ టెస్ట్,కొలెస్ట్రాల్ టెస్ట్, 2డి ఎకో గుండె పరీక్షలు మరియు డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు ఏది లేకుండా 3000 రూపాయల విలువగల పరీక్షలను ఉచితంగా చేయడం జరిగిందని తెలిపారు…

ఈ కార్యక్రమంలో షుగర్ పేషంట్ లను పరిశీలించి వారి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అలాగే శారీరక వ్యాయామాలు చేయడం,కొలెస్ట్రాల్ తక్కువ వున్న సమతుల్య ఆహరం తీసకోవాలని అలాగే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తగినంత మోతాదులో ప్రతి నిత్యం లిమిటెడ్ పద్దతిలో తీసుకోవాలని ఆరోగ్య విషయంలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.

వైద్యం అనేది నిరుపేదలకు అందుబాటులో వుండే విధంగా చేస్తామని దానిలో భాగంగానే హెల్త్ క్యాంప్ లను నెల నెల నిర్వహించడం జరుగుతుందని ఆసుపత్రి వైద్యులు అన్నారు…


SAKSHITHA NEWS