SAKSHITHA NEWS

అభివృద్దే ధ్యేయంగా దుండిగల్ మున్సిపాలిటీని అభివృద్ధి పరిచాం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద …

ఈరోజు దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి మున్సిపాలిటీని మౌలిక వసతుల కల్పనలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని, రానున్న రోజుల్లో కూడా దుండిగల్ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.

అనంతరం దుండిగల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ , ఎమ్మెల్సీ శంభీ పూర్ రాజు చూపిన ప్రత్యేక శ్రద్ధ గురించి 18వ వార్డు కౌన్సిలర్ పల్పనూరి మౌనిక విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాలలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. వారి సహాయ సహకారం ఎల్లప్పుడూ గ్రామానికీ ఉండాలని ఆకాంక్షించారు.

శంకుస్థాపన కార్యక్రమ వివరాలు….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ 18వ వార్డులో భ్రమరాంబిక మల్లికార్జున ఆలయం వద్ద రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు….

గ్రామంలోని కమాన్ నుండి బొడ్డురాయి వరకు రూ.ఒక్క కోటి పది లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

గ్రామ బస్ స్టాప్ నుండి బొడ్డురాయి వరకు గ్రామంలో రూ.45లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్-పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ , వైస్ చైర్మన్ పద్మారావు, పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, బెంబడి వనిత బుచ్చిరెడ్డి, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాచారం సునీత మురళి యాదవ్, పాక్స్ డైరెక్టర్లు భీమ్ రెడ్డి, సత్తిరెడ్డి, మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, దర్శన్ రెడ్డి, షామీర్పేట్ హనుమంతరావు, కృష్ణారెడ్డి, యాదయ్య, రాజిరెడ్డి, మల్లేష్, జంగారెడ్డి, మహేష్ యాదవ్, రాజు గౌడ్, పద్మా రెడ్డి, వార్డు ప్రెసిడెంట్లు మని శేఖర్, కామేష్, సోమరాజు, మరియు గ్రామ పెద్దలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app