ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు DSP ఉద్యోగానికి రాజీనామా..
ప్రజాసేవ చేయాలన్న తపన ఆయనతో DSP ఉద్యోగానికి రాజీనామా చేయించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు చెందిన మందనం గంగాధర్ DSP ఉద్యోగం నుంచి VRS తీసుకున్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల MLC ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఆయన చెప్పారు. 1998 బ్యాచ్ ఎస్సైగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. గంగాధర్ ఉమ్మడి నల్గొండ జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించారు.