కొర్లగుంట మెయిన్ జంక్షన్ వద్ద పొంగి రోడ్లపై పోతున్న డ్రైనేజీ సమస్యను శాశ్వత పరిష్కారం చేయండి.
సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నేడు డిప్యూటీ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
తిరుమల బైపాస్ రోడ్డు కొర్లగుంట జంక్షన్లో 20-1-200/ఏ వద్ద డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. పొంగి మార్కెట్ రోడ్డు రోళ్ళు కొట్టే సర్కిల్ వరకు రోడ్లపై ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతున్నది ఈ సమస్యను తక్షణo పరిష్కరించాలని పెద్దకాపువీది లేఅవుట్ లో నిత్యం పొంగుతున్న యు డి ఎస్ సమస్యను పరిష్కారం చేయాలని నేడు సోమవారం ఉదయం గ్రీవెన్స్ సందర్భంగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చరణ్ తేజ రెడ్డికి సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కే వేణుగోపాల్ మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉన్నాయని ఏ సందులో చూసిన నీ వీధిలో చూసిన యుడిఎస్ తరచూ పొంగి వీధులపై ప్రవహిస్తుందన్నారు.
దీనివల్ల స్థానికంగా ఉన్న ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని మున్సిపల్ అధికారులు రోజు అన్ని ఏరియాలలో ఫాగింగ్ చేయాలని బ్లీచింగ్ చల్లడం స్ప్రే చేయడం నిత్యం చేయడం ద్వారా సీజనల్ వ్యాధులనుండి కనీసం కొంతైనా ఉపశమనం కలుగుతుందని అన్నారు.
కొర్లగుంట మెయిన్ జంక్షన్లో పొంగడానికి ఫుట్ పాత్లు ఆక్రమునకు గురై ఉన్నది ఈ ఆక్రమణనను మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని నిర్మాణం చేసుకున్న వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
రోడ్లపై పారుతున్న డ్రైనేజీలు రోడ్డుపైకి రాకుండా ప్రత్యాన్మయ ఏర్పాట్లు చేయాలని తిరుమల బైపాస్ రోడ్డు కావడంతో నిత్యం అధికారులు యాత్రికులు ప్రజా ప్రతినిధులు ఆ ప్రాంతంలో తిరుగుతూన్న పరిస్థితి ఉన్నది బయట నుంచి వచ్చేటటువంటి వారికి తిరుపతి అంటే పుణ్యక్షేత్రం సుందరంగా ఉంటుందని అందరికీ మనసులోనూ ఉంటుంది.
అయితే తిరుపతి అంటే మురికి నీరు డ్రైనేజీ నీరు కలిసి రోడ్లపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతుంటే తిరుపతి కి ఉన్న పేరు కూడా దెబ్బతింటుంది.
కనుక స్వచ్ఛ తిరుపతి స్మార్ట్ తిరుపతి అవార్డు తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు డ్రైనేజీ సమస్య లేని నగరంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి బుజ్జి ఎం నరేంద్ర ఏ రాధాకృష్ణ ఆర్ మల్లికార్జునరావు ఎం రాజు పి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నమస్కారములతో
కే వేణుగోపాల్ సిపిఎం నగర కార్యదర్శి