సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని వెస్టర్న్ హిల్స్ అడ్డగుట్ట సొసైటీ కాలనీ లో ఎమర్జెన్సీ వర్క్ కింద జరుగుతున్న డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను జలమండలి అధికారులు మరియు కాలనీ వాసులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, అడ్డగుట్ట లో డ్రైనేజ్ లైన్ నిత్యం పొంగుతూ, ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నది అని కాలనీ వాసుల అభ్యర్థన మేరకు, జలమండలి జి ఎం, డి జి ఎం మేనేజర్ తో సమావేశమయ్యి ఎమర్జెన్సీ పని కింద డ్రైనేజ్ లైన్ సాంక్షన్ చేయించి పనులను వెంటనే మొదలు పెట్టడం జరిగింది అని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగింది, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అదే విధంగా, డ్రైనేజి పైప్ లైన్ పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని జలమండలి అధికారులకు, తగు సూచనలు చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ప్రశాంతి, సూపర్వైజర్ నరేంద్ర, కాలనీ వాసులు సుబ్బారావు, రాంకుమార్, బి ఆర్ ఎస్ నాయకులు గోపీచంద్, కుమార స్వామి, వెంకటయ్య యాదవ్, సత్యనారాయణ, నక్క శ్రీనివాస్, బ్రహ్మయ్య, రవి మాధవ్, తదితరులు పాల్గొన్నారు.