SAKSHITHA NEWS
Drainage in Shanshiguda overflowed onto the road

124 డివిజన్ పరిధిలోని శంషిగుడాలో డ్రైనేజీ పొంగి రోడ్డు మీదకు రావడంతో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని కాలనీ వాసులు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా, కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి శంషిగుడాలో పాదయాత్ర చేసి సమస్యను స్వయంగా తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని శంషిగుడాలో పొంగుతున్న డ్రైనేజీని అత్యవసర పనిగా పరిగణించి వెంటనే డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో AE సుభాష్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, రాములుగౌడ్, సాయికిరణ్, ప్రశాంత్, సురేష్, నాగిరెడ్డి, పద్మారావు, సూపర్వైజర్ శివ, SFA మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.