డిప్యూటీ సిఎం పవన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి..
అమరావతి: ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని, డా . కందుల గౌతమ్ నాగి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ,సైన్సు అండ్ టెక్నాలజీ శాఖలకు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ప్రస్తుత బీజేపీ విప్ , శాసనసభ్యులు సి. ఆదినారాయణ రెడ్డి (మాజీ మంత్రివర్యులు) తో కలిసి పవన్ కళ్యాణ్ ను కలిసినట్లు గౌతం తెలిపారు.
ఈ సందర్బంగా పలు రాజకీయ అంశాలు ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించామని అన్నారు. పశ్చిమ ప్రకాశం వెనుకబాటుతనం గురించి , వెలుగొండ ప్రాజెక్ట్ గురించి, పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు కేటాయించాలని , మార్కాపురం ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాలని గౌతమ్ నాగి రెడ్డి,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కోరారు