వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ పత్రాలను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి , స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ఈ సందర్బంగా మీడియా పాయింట్ వద్ద డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరే విదంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.