SAKSHITHA NEWS

Dr. BR Ambedkar’s new statue was unveiled by MLA Gorle Kiran Kumar

శ్రీకాకుళంజిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం అల్లినగరం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సమాజానికి,ప్రపంచానికి అందించిన సూచనలు, రాజ్యాంగబద్ధమైన విలువలను ప్రజలందరూ కాపాడితేనే ఆయనకు సరైన నివాళులర్పించినట్టని తెలియజేశారు.ఈ కార్యక్రమంలోఅల్లినగరం సర్పంచ్ ఎంపీటీసీ,జిల్లాBSP ప్రెసిడెంట్ రామప్పడు,BSP వైస్ సర్పంచ్ యాదవ్ రావు,ఎచ్చెర్ల నియోజకవర్గం BSPఅధ్యక్షులు జి రామారావు,స్థానిక జై భీమ్ యువజన సంఘ సభ్యులు,వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS