SAKSHITHA NEWS

కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోకండి…
ప్రభుత్వ వైద్యశాలల్లో నాణ్యమైన వైద్యం…
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం…
ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి…
నేలకొండపల్లి


వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లి డబ్బులు దార పోసి ఆర్థికంగా నష్టపోవద్దని కందల ఉపేందర్రెడ్డి సూచించారు. నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారం గ్రామంలో కల్వరి క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ వైద్యశాలలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలన్నారు.

మండల, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులలో కొన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో లేనిపక్షంలో తనను సంప్రదిస్తే హైదరాబాదులోని తనకు తెలిసిన ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొందరు రైతులు వారబంది విధానంలో లోపాల వల్ల పంటలు ఎండిపోతున్నాయని ఆయన దృష్టికి తీసుకుపోగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

ఇది రైతు ప్రభుత్వం అని రైతులకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని ఆయన చెప్పారు. అదే పలువురు వివిధ రకాల సమస్యలను ఆయన దృష్టికి తేగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉప చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, గ్రామ సర్పంచ్ ఈవురి సుజాత శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఉన్నం బ్రహ్మయ్య, వెన్నబోయిన శ్రీను, నంబూరు సత్యనారాయణ, మరికంటి రేణుబాబు, కోటి సైదా రెడ్డి, వట్టికుట్టి లక్ష్మయ్య, నాగవెల్లి తిరుమలరెడ్డి, అమరగాని ఎల్లయ్య, చౌడం నాగేశ్వరరావు, కొండా శ్రీను, ఈవూరి శ్రీనివాసరెడ్డి, కనమర్లపూడి రామకృష్ణ, యడవల్లి శ్రీను, ఆకుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS