
పంటలు ఎండిపోతున్నా పట్టించుకోరా
కూడవెల్లి వాగుతో పాటు చిన్న శంకరంపేట, రామాయంపేట కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేయాలి
భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక: పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కూడవెల్లి వాగుతో పాటు చిన్న శంకరంపేట, రామాయంపేట కాలువలకు వెంటనే నీళ్లు విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.. గత నెల రోజులుగా మల్లన్న సాగర్ నుండి కూడవెల్లి వాగుతో పాటు చిన్న శంకరంపేట, రామాయంపేట కాలువలకు నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వం కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు..
కూడవెల్లి జాతర జరగనున్న దృష్యా నీటిని విడుదల చేయాలని, అలాగే రామాయంపేట, చిన్న శంకరం పేట కాలువలకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి దుబ్బాక ప్రజల పక్షాన విజ్ఞప్తి చేశారు. మల్లన్న సాగర్ లో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పటికీ నీటిని విడుదల చేయడం లేదని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు..
సానుకూలం గా స్పందించిన మంత్రి వర్యులు,రేపటి లోగా నీటి విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app