Donors are the biggest difficulty for a poor family
పేద కుటుంబానికి పెద్ద కష్టం దాతలు ముందుకు వచ్చి సాయం చేయండి 20వ వార్డు మాజీ కౌన్సిలర్ చిత్తారి శ్రీనివాసులుజనవరి 3 సాక్షిత ప్రతినిధి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీ 20వ వార్డు లో కళ్యాణం ఆంజనేయులు సన్నాఫ్ కళ్యాణం సాయిలు వయసు 26. ఆంజనేయులుకు భార్య మూడు సంవత్సరాల పాప ఉంది.
కూలి పని చేసుకుని బతుకేవాడు. పని చేసుకునే క్రమంలో మిషన్ లో చెయ్యి పడి చెయ్యి పనిచేయడం లేదు. ఈ విషయం 20వ వార్డు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి అట్టి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భయపడవద్దని మీడియా వల్ల అట్టి కుటుంబానికి న్యాయం జరుగుతుందని సహాయం చేసే దాతలు సహాయం చేస్తారని ఉద్దేశంతో చిత్తారి శ్రీనివాసులు భరోసా కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా చిత్తారి శ్రీనివాసులు మాట్లాడుతూ కళ్యాణ అంజనేయులు కటిక పేదవాడని పని చేసుకునే క్రమంలో మిషన్ లో చెయ్యి పడి పనిచేయకుండా పోయిందని వైద్య ఖర్చులకు ఆర్థిక సోమత లేకపోవడంతో అతని భార్య సావిత్రి ఇళ్లల్లో పని చేసుకుంటూ భర్త.
పాప. పోషణ తనే చేస్తుందని పెద్ద హాస్పిటల్ లో చూపించుకుంటే బాగుపడే అవకాశాలు ఉన్నాయని దీనికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని కల్వకుర్తి పట్టణంలో ఎంతోమంది గొప్ప వ్యక్తులు. దాతలు ఉన్నారని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆంజనేయులుకు సహాయం చేసేవారు అకౌంట్ నెంబర్.SBI.36878236420 కు చేయాలనిఆయనకోరారు.
ఈకార్యక్రమంలో20వవార్డ్.మాజీకౌన్సిలర్.శ్రీనివాసులు.కొండపల్లి గణేష్.చిత్తారి శివరాములు.చిత్తారి వేణు
కప్పెర రామస్వామి.చిత్తారి నిరంజన్.చిత్తారి ఎల్లమ్మ.
కళ్యాణం ఆంజనేయులు.
చిత్తారి ఆంజనేయులు.
కళ్యాణం సాయి. ఇంద్రానగర్ 20వ వార్డు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు