SAKSHITHA NEWS

వరద బాధితులకు సహాయార్ధనిమిత్తమై ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళం
అందించిన రాష్ట్ర త్రిదళ మాజీసైనికులను అభినందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి

బాపట్ల జిల్లా బాపట్ల అర్బన్ (రాష్ట్ర మాజీసైనికుల లీగ్ ముఖ్యాలయం). రాష్ష్ట్రం లో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన వరద బాధితులకు సహాయార్ధనిమిత్తమై అనేకసంస్థలు మరియు సంపన్నులు ముందుకు వచ్చి సహాయాన్ని అందించారు. దేశసేవలందించిన మాజీసైనికులు వరద బాధితులకు సహాయార్ధనిమిత్తమై తమవంతు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు అక్షరాలా రెండు లక్షల యాఫై తొమ్మిదివేల ఐదు వందల ఆరు రూపాయల గల డిమాండ్ డ్రాఫ్ట్ ను వెలగపూడి నందు ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి కి అందించినట్లు రాష్ట్ర మాజీసైనికుల లీగ్ ముఖ్యాలయ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్ తెలియచేశారు. రాష్ట్రం లో మాజీసైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీసైనికుల గుండెల్లో నిలిచిపోయారని ధన్యవాదాలు తెలియచేస్తూ చాల కాలం నుండి మాజీసైనికుల సమస్యలు మరియు సంక్షేమవివరాలు చర్చించి వాటిని పొందుపరచిన వినతి పత్రం వర ప్రసాద్ ముఖ్యమంత్రి కు సమర్పించారు,

వినతి పత్రం స్వీకరించిన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సైనికులు దేశానికి వెన్నుముఖలాంటివారని తప్పకుండ వారి మనవులను పరిగణలోకి తీసుకొని పర్యవేక్షించి అమలులోకి తెస్తామని మాట ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల మాజీసైనికులను ముఖ్యమంత్రి మరియు బాపట్ల నియోజకవర్గ శాసనసభాపతి వేగేసిన నరేంద్ర వర్మ అభినందించారు. ఈ సమావేశంలో బాపట్ల మాజీసైనికుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మాణిక్యరావు, ముఖ్య కార్యదర్శి షేక్ కాలేషా, అడ్మిన్ రెడ్డి ప్రశాంత్ కుమార్, సంయుక్త కార్యదర్శి ఏస్ధాని, కోశాధికారి వంశీ కృష్ణ, టిడిపి గల్ఫ్ కంట్రీస్ కోఆర్డినేటర్ వెంకట అప్పారావు, సభ్యులు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS