SAKSHITHA NEWS

యాదవ విద్యావంతుల వేదిక హెచ్చరిక

యాదవులకు సీట్లు ఇవ్వని పార్టీలకు ఓట్లు వేయం

యాదవ విద్యావంతుల వేదిక హెచ్చరిక..

రానున్న శాసనసభ, పార్లమెంటు ఎన్నికలలో యాదవులకు తగిన ప్రాతినిధ్యం కల్పించని రాజకీయ పార్టీలకు ఓట్లు వేయబోమని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. “సీట్లు – వాటా – ఆర్థిక వాటా – రాజ్యాధికారం అంతిమ బాట ” అంశంపై నిర్వహించిన సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ తెలుగు నేలపై యాదవ, యాదవ ఉపకులాల జనాభా 18 శాతం ఉందని తెలిపారు. కాగా జనాభా దామాషా ప్రకారం అన్నీ రంగాలలో ప్రాతినిధ్యం కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అన్నీ రాజకీయ పార్టీలు యాదవ, యాదవ ఉప కులాలకు 22 ఎమ్మేల్యే, 7 ఎమ్మెల్సీ, 5 లోక్ సభ , రాజ్యసభ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జనగణనలో కుల గణన తక్షణమే చేపట్టాలని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర బడ్జెట్ లో యాదవులకు 18 శాతం నిధులు కేటాయించాలని, యాదవ, యాదవ ఉప కులాలకు ఎస్ ఎన్ టీ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గొల్ల కురుమలు గొర్రెల కోసం కాకుండా సీట్ల కోసం గొంత్తెత్తాలని, రాజకీయ పార్టీల మాయ మాటల వలలో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీఐ మాజీ చీఫ్ కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, యాదవ సంఘ నేతలు గుండేబోయిన అయోధ్యా యాదవ్, శ్రీశైలం యాదవ్, ద్రవిడ దేశం పార్టీ జాతీయాధ్యక్షులు కృష్ణారావు, కోన గురవయ్య, సినీనటి కరాటే కల్యాణి, డాక్టర్ కాలువ మల్లయ్య, చింతల రవీంద్రనాథ్, ఉడుత రవీందర్, మన్మోహన్ యాదవ్, పొచబోయిన శ్రీహరి, సిద్ది రమేష్ యాదవ్, మేకల రాములు యాదవ్, నోముల సైదులు, ఆవుల మంజులత, దాసరి శ్రీనివాస్, డాక్టర్ దూదిమెట్ల శ్రీనివాస్, రమేష్ యాదవ్, మైకోల్ మహేందర్ యాదవ్, ఆర్.ఎన్. గౌతమ్, భేరి రాంచందర్ యాదవ్, బొబ్బల గోపాలకృష్ణ యాదవ్
సీనియర్ జర్నలిస్ట్ మేకల కృష్ణ యాదవ్, గజ్జి సమతా యాదవ్, సాధం బాలరాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS