SAKSHITHA NEWS
Do not relieve officers who are on deputation

డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దు

ఆంధ్ర ప్రదేశ్ :

ఏపీకి డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం

కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా డెప్యుటేషన్‌పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు

రిలీవ్ చేయాలని దరఖాస్తు చేస్తున్న డెప్యుటేషన్‌పై వచ్చిన పలువురు అధికారులు

మాతృ సంస్థకు వెళ్తానని దరఖాస్తు చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరరెడ్డి

ఏపీ నుంచి రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసిన గనులశాఖ ఎండీ వెంకటరెడ్డి, ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ కమిషనర్ రాజేశ్వర్‌రెడ్డి

తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలన్న సమాచారశాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి –

డెప్యుటేషన్‌పై వచ్చిన వారిపై గతంలో పెద్దఎత్తున విమర్శలు చేసిన టీడీపీ

తెలంగాణకు వెళ్తానన్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్

తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారుల దరఖాస్తులు

ఉన్నతాధికారులు ఎవరికీ సెలవులు ఇవ్వకూడదని ప్రభుత్వ నిర్ణయం

సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి

ధర్మారెడ్డి సెలవు దరఖాస్తును తిరస్కరించిన ప్రభుత్వం

ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్న సీఐడీ చీఫ్ సంజయ్