SAKSHITHA NEWS

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దు… ఎమ్మెల్యేకు కోల రవీందర్ ముదిరాజ్ వినతి..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోగల సుమారు ఐదు శివారు గ్రామల గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లు, ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని సామాజిక కార్యకర్త కోల రవీందర్ ముదిరాజ్ శివారు గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
జిహెచ్ఎంసి పరిధిలోగల వందలాది గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయాయని, అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోగల సుమారు ఐదు శివారు గ్రామలు కూడా సరియైన అభివృద్ధికి నోచుకోలేదని వాపోయారు. అంతేకాకుండా ఇక్కడ నివసిస్తున్న వారియొక్క మరణించిన తాతలు, తండ్రుల పేరున ఉన్న ఇండ్లు, ఇండ్ల స్థలాలు తమ పేరున రిజిస్ట్రేషన్ కాకపోవడం మూలన ఇప్పటివరకు మరణించినవారిపేరుమీదనే పన్నులు చెల్లిస్తున్నామన్నారు. తాము ఇక్కడి స్థలాలలో నిర్మాణాలు చేపట్టేందుకు జిహెచ్ఎంసి,పురపాలక సంఘాలు మరియు కార్పోరేషన్లు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని వాపోయారు. అంతేకాకుండా ఇక్కడి రెవెన్యూ అధికారులు గ్రామ కంఠ ధ్రువీకరణ పత్రాలుగానీ, కుటుంబ సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలు కానీ ఇవ్వడం లేదని అన్నారు. ఇక్కడి ఇండ్లు ఇండ్ల స్థలాలకు బ్యాంకువారు రుణాలు ఇవ్వడంలేదని,రిజిస్ట్రేషన్ శాఖ వారు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి తాము ఇండ్లు నిర్మించుకునేందుకు అధిక వడ్డీతో ప్రైవేటు అప్పులు తీసుకొని,లేదా ఉన్న నాలుగైదు గుంటల భూమిని అమ్ముకొని ఇండ్లు నిర్మించుకుంటే జిహెచ్ఎంసి వారు 100% ఇంటి పన్ను అధికంగా వేస్తున్నారని వాపోయ్యారు. కాబట్టి ఇక్కడి ఇండ్లు,ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దని కోరారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించి శివారు గ్రామ ప్రజలకు మేలు చేయాలని కోల రవీందర్ ముదిరాజ్ వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బౌరంపేట్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, కిషన్ రావు, బుచ్చిరెడ్డి,, సంబంధిత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ కంఠంలో ఉన్న ఇండ్లకు రిజిస్ట్రేషన్ విలువ పెంచొద్దు

SAKSHITHA NEWS