దీపావళి పండుగ సందర్భంగా వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” రాత్రి వికారాబాద్ పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణాలలో ఏర్పాటు చేసిన లక్ష్మి పూజలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… దీపావళి అంటే చీకటి పై వెలుగు, చెడు పై మంచి, నిరాశ పై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ అన్నారు. మనమందరం ఇళ్లలో, దుకాణాలలో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి, సంపద, అదృష్టం, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజీస్తామన్నారు.
వికారాబాద్ నియోజవర్గ మరియు జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.