SAKSHITHA NEWS

District-wide encephalitis vaccination program should be successful

జిల్లా వ్యాప్తంగా మెదడువాపు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

బడి, బడిబయట పిల్లలందరికీ టీకాలు అందించేందుకు చర్యలు__ మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి


మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా సాక్షిత న్యూస్ ప్రతినిధి;


మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మెదడువాపు వ్యాధి (జపనీస్ ఎన్కెఫలైటీస్) టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ విషయంలో బడిలో చదువుతున్న విద్యార్థులతో పాటు బడి బయట ఉన్న పిల్లలందరికీ అందచేసేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.


జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన విధంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది జిల్లాలోని 9 నెలల నుంచి 15 సంవత్సరాల వయస్సు ఉన్న వారికి ఒక డోస్ వ్యాక్సిన్ అందచేస్తారని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఆయా స్కూళ్ళలో ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలలో 9 నెలల నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు టీకాలు అందచేయడంతో పాటు బడి బయట కూడా ఉండే పిల్లలందరికీ మెదడువాపు రాకుండా ఉండేందుకు ఈ వ్యాక్సిన్ను 0.5 ఎమ్ఎల్లు వారి కండరాల్లోకి టీకా ద్వారా ఇస్తారని వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీన ప్రారంభించడం జరుగుతుందనితెలిపినారు .

జిల్లా వ్యాప్తంగా 11 లక్షల 26 వేల 236 మంది పిల్లలకు ప్రతి నిత్యం 200 మందికి ఒక ఆరోగ్య కార్యకర్త ఈ టీకాలను ఇస్తారని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే -మొదటి రెండు వారాలు పాఠశాలల్లో టీకాలు వేయడం జరుగుతుందని అనంతరం మూడో వారం జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో టీకాలు ఇస్తారని స్పష్టం చేశారు.

పాఠశాలల్లో ఏఎన్ఎమ్, ఆశ వర్కర్, స్కూల్ హెడ్మాస్టర్, క్లాస్ టీచర్ ఒక బృందంగా ఏర్పడి ఉంటారని అంగన్వాడీ కేంద్రాల్లో నలుగురు ఏఎన్ఎమ్లు, అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త అంగన్వాడీ ఆయా ఉంటారని వారి ఆధ్వర్యంలో టీకాలు వేస్తారని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వివరించారు.

ముఖ్యంగా – ఈ వ్యాధి పందులు, పక్షాలు ద్వారా చెందుతుంది. మెదడువాపు వ్యాధికి నివారణ లేదని ఆ వ్యాధి సోకిన వారిలో ముప్పై శాతం మందికి మరణం సంభవిస్తున్నందున అలాంటివి జరగకుండా టీకాలను వేయడం జరుగుతుందని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకొని టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, డీఈఎమ్వో వేణుగోపాల్రెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సరస్వతి, డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ నారాయణరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ రామ్కుమార్, ఆయా శాఖల అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS