SAKSHITHA NEWS

ఏలూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయములో ఈ రోజు అనగా 03.04.2023 వ తేది నాడు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు స్పందన కార్యక్రమమును నిర్వహించారు.

ఈ స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి  ఫిర్యాదిదారులు వచ్చి జిల్లా  ఎస్పీ  గారికి పిర్యాదులను ఎక్కవగా  వర కట్నం వేదింపులు, సరిహద్దుల విషయములో గొడవలు, సివిల్ వివాదలపై  పిర్యాదులు  ఇచ్చినట్లు,

@ఏలూరు నుండి ఒక మహిళ ఎస్పీ గారిని స్పందన కార్యక్రమంలో కలిసి తన యొక్క భర్త జీవనంపాది కొరకు కొంతమంది వద్ద అప్పులు చేసిన నేపథ్యంలో వారి యొక్క వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నట్లు వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినది

@తణుకు నుండి ఒక మహిళ ఎస్పీ గారిని స్పందన కార్యక్రమంలో కలిసి తాను కులాంతర వివాహం చేసుకున్నట్లు తనకు తెలియకుండగా తన భర్త వారు ఆమె యొక్క సంతకం లేకుండా భీమవరం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆస్తిని వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవలసినదిగా కోరినది

@గుంటూరు నుంచి ఒక మహిళ ఎస్పీ గారిని స్పందన కార్యక్రమంలో కలిసి గతంలో తనకు తన భర్తకు మధ్యన జరిగిన విషయాలపై గుంటూరులో కేసులు నమోదు చేసినట్లు తన కుమారుడు ప్రస్తుతం దెందులూరు మండలంలో నిర్వహిస్తున్న ముస్లిం స్కూల్ నందు చదువుకుంటున్న వాడిని పట్టుకొని పోవడం కొరకు ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినది

@మండవల్లి మండలం పులపర్రు గ్రామము నుండి ఒక వ్యక్తి ఎస్పీ గారిని స్పందన కార్యక్రమంలో కలిసి తనకు పరిచయం ఉన్న వ్యక్తి పొలం కొనుగోలు చేయుట కొరకు 1,10,000 తీసుకొని పొలము కొనుగోలు చేయించకుండా డబ్బులు తిరిగేవ్వకుండా మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినాడు

@ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ పరిసరాల ప్రాంతాలలో నివాసం ఉంటున్న కొంతమంది ఎస్పీ గారిని స్పందన కార్యక్రమంలో కలిసి దీపారాధనకు ఉపయోగించే వత్తుల తయారీ మిషన్లను ఇస్తాను అని చెప్పి లోకేష్ అనే ఒక వ్యక్తి అతనికి సహకరించిన లక్ష్మణ అనే ఒక వ్యక్తి సహకారంతో అందరి వద్దనుండి సుమారు కోటి రూపాయలను వసూలు చేసి మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవలసినదిగా కోరినారు.

స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై సత్వరమే చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాటలాడి ఆదేశాలు ఇచ్చిన జిల్లా ఎస్పీ గారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేసే నకిలీ ఏజెంట్లు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం వారి వద్ద నుండి గుర్తింపు పొందిన ఏజెంట్లను సంప్రదించాలని నకిలీ ఏజెంట్లను సంప్రదించడం వలన విదేశాలకు వెళ్లి ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దని ఈ పత్రికా ప్రకటన ద్వారా జిల్లా ఎస్పీ గారు తెలియ చేసినారు


SAKSHITHA NEWS