SAKSHITHA NEWS

వినాయకుని ఏర్పాట్లకు అన్ని నిబంధనలు పాటించాలి …
జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి

శ్రీ సత్య సాయి జిల్లా వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహం ఏర్పాట్లుకు,,సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఎస్.హెచ్.ఓ అనుమతులు తప్పనిసరిగా ఉండాలిని. ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ ఆదేశించారు.

*ఈనెల సెప్టెంబర్ 18న వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహించే కమిటీ వారు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో పోలీసు వారి అనుమతులు తప్పనిసరిగా పొందాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ ఐపీఎస్ తెలిపారు.

పాటించవలసిన నియమ నిబంధనలు మరియు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలు గురించి ఎస్పీ వివరించారు.

*వినాయక ,విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు/మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో తెలపాలని, గుర్తింపు కార్డు నకలు కాపీలు పోలీస్ వారికి చూపించి అనుమతులు తీసుకోవాలన్నారు.

ప్రైవేట్ లేదా పంచాయతీ మున్సిపాలిటీ కి సంబంధించిన స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసే వారు ముందుగా సదరు ప్రవేటు స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే పంచాయతీ లేదా మున్సిపాలిటీ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. *వారితోపాటు చుట్టుపక్కల నివసించే వారి సమ్మతి కుడా పొందాలన్నారు.

అగ్నిమాపక, విద్యుత్ శాఖల అనుమతి తీసుకోవాలని, వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు,మండపాల వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు.

మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలని, విద్యుత్ వైర్లను మరియు కాంతివంతమైన, లైట్ల వినియోగంలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా విద్యుత్ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రతిష్టించనున్న వినాయక విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, నిమజ్జన ప్రదేశము , విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విరిగా పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు తెలియజేయాలన్నారు.

లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలన్నారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎట్టిపరిస్థితులలోను ఉపయోగించరాదన్నారు.

భద్రత కొరకు రాత్రి సమయాలలో మండపాల వద్ద ఉత్సవ కమిటీ వారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రాత్రి సమయాలలో పందిళ్ళు,మండపాలలో డబ్బులు, బంగారం లాంటివి, ఇతర విలువైన వస్తువులు ఉంచరాదన్నారు.

వినాయక పందిళ్ళు, విగ్రహాల ఏర్పాటు చేసే ప్రాంతం గాని, రోడ్లపైన ఉండరాదన్నారు. వినాయక పందిళ్ళ వలన రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఊరేగింపు సమయాలలో ఎక్కడ కులాలు, మతాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేయరాదన్నారు.

విగ్రహ నిమజ్జన ఊరేగింపు సమయంలో ,రంగులు చల్లడం, లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం, మందుగుండు సామాగ్రిని పేల్చడం చేయరాదన్నారు

పందిళ్ళ వద్ద మరియు ఊరేగింపు సమయాలలో,మద్యం లేదా మత్తు పదార్ధాలను వాడిన వారు ఆ ప్రాంతంలో,లేకుండా ఉండే విధంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలన్నారు.

నిమజ్జనముల ఊరేగింపుకు పోలీసు వారు అనుమతించిన సమయం, కేటాయించిన ప్రదేశం మరియు ఊరేగింపునకు కేటాయించిన మార్గము లాంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు.

వినాయక నిమజ్జనానికి వెళ్లే వాహనం పై మద్యం లేదా మత్తు పదార్ధాలను సేవించిన వారు మరియు మైనర్ లు ఉండరాదన్నారు. గణేష్ నిమజ్జనానికి వెళ్లేటప్పుడు చిన్న పిల్లలను తీసుకువెళ్లరాదన్నారు.

ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉత్సవ కమిటీ కార్యనిర్వాహకులే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.

వినాయకచవితి పండుగ రోజు నుండి నిమర్జనం వరకు జరిగే పూజలు, వేడుకల సందర్భాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని,ఎస్పీ ఆదేశించారు.

ముందస్తు చర్యలలో భాగంగా పై నియమ నిబంధనలు సూచించామన్నారు. జిల్లాలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనే నిర్వాహకులు లేదా ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలని
ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే పూర్తి బాధ్యత నిర్వాహకులు, కమిటీ సభ్యుల పై ఉంటుందన్నారు.

, కావున వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులే తగిన భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటే ముందుగానే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరచాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.


SAKSHITHA NEWS