SAKSHITHA NEWS

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవము సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్ డి. ఎస్పి సత్యనారాయణ తో, సాయుధ దళ డి. ఎస్పీ నరేందర్ రావు తో, సైబర్ సెక్యూరిటీ వింగ్ డి.ఎస్పి సత్తయ్య తో కలసి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా కార్యాలయ అధికారులతో, సిబ్బంది తో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భారత దేశములో అందరికి ఆగస్ట్15న స్వతంత్రం వస్తే నిజాం ప్రాంతంగా పిలువబడుతున్న మన హైదరాబాద్ ప్రాంతానికి స్వతంత్ర సమరయోధులు పోరాటం తో సైనిక చర్యను జరిపి 1948 సెప్టెంబర్17 న భారత యూనియన్ లో కలిపి ప్రాంతానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ను కల్పించారని అన్నారు. ఆ క్రమం లో దేశంలో అన్ని సంస్థనాలు భారత యూనియన్ లో కలిసినప్పటికి నిజాం రాజు కలవడానికి ఇష్టం లేకపోవడం, అలాగే అప్పట్లో ఖాసీం రజ్వి ప్రజల పై జరిపే హింస పెరిగిపోవడం తో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ, కొమురం బీమ్ వంటి వారు పోరాటాలు సాగించేవారని వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రధాని నెహ్రు, ఉపప్రదాని హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చోరువతో జనరల్ చౌదరి అధ్వర్యంలో సైనిక చర్య జరిపి నిజాం ప్రాంతాన్ని భారత్ లో కలపడం జరిగిందని, ఇందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. చరిత్రను మనం మరవకూడదని, చరిత్రను తెలుసుకోవాలని ఆ రోజుకు గుర్తుగా మనo తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.

అలాగే ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందేలా ప్రజా పాలన అధించాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికీ వారి స్థాయినీ భట్టి కాకుండా ధనిక, పెద అనే తారతమ్యం లేకుండా అందరికీ సమానమైన సేవలు అందించాలని, ప్రతి ఒక్కరు పోలీస్ ఇమేజ్ ను మరింత పెంచే విధంగా కృషి చెయ్యాలని తెలియజేస్తూ పోలీస్ అధికారులకు, సిబ్బందికి అందరికీ తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ ఇంచార్జి సిఐ నాగేశ్వర రెడ్డి, ఆలంపూర్, శాంతి నగర్ సీఐ లు రవి బాబు, టాటా బాబు, సైబర్ క్రైమ్ సిఐ రాజు,అర్ ఐ లు వెంకటేష్, హరీఫ్ , ఎస్సై లు శ్రీనివాస్, శ్రీకాంత్, రజిత, అరుణ సూపరిండెంట్స్ నాగేందర్, నయీం మరియు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాoబ గద్వాల్ జిల్లా.


SAKSHITHA NEWS