SAKSHITHA NEWS

యాంటీ మలేరియా మాసోత్సవాల ర్యాలీని ప్రారభించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారి బి. మీనాక్షి

మలేరియా పై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.బి. మీనాక్షి పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాంటీ మలేరియా మాసోత్సవాల ర్యాలీనిజండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీ నుండి 30 వ తేదీ వరకు యాంటీ మలేరియా మాసోత్సవాల కార్యక్రమాలు జరుపు కుంటామని, రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు నిర్మూలనకు ముఖ్యంగా దోమకాటు వ్యాధులు (డెంగు, మలేరియా, చికెన్ గున్యా, జె.ఇ.) నిర్మూలనకు ఈ సంవత్సరం ముందుగానే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇంటి చుట్టు పక్కల, ఇంటిలోపల దోమల లార్వా సర్వే నిర్వహించాలన్నారు.ఈ ర్యాలీలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనూరాధ, జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ,వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS