SAKSHITHA NEWS

ఎలక్షన్ లో గెలుపు మాట పక్కన బెట్టి?ఉమ్మడి జిల్లాల(గుంటూరు, పల్నాడు)..ఎంపీ అభ్యర్థులు.. గుంటూరు మిర్చి లాగా.. యమ సౌండు గురూ…నేతల ఆస్తులు కోట్లలో..అయిన సింపుల్ అండ్ సాఫ్ట్ గా ప్రజలకు చేరువలో?

గుంటూరు, పల్నాడు జిల్లాలో లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులు ఒకరికొకకరు వ్యాపార పరంగా పోటీపడుతున్నారు.

అసెంబ్లీ అభ్యర్థులను మించి ఆస్తులు. ఇక గుంటూరులో ఇద్దరు కోటీశ్వరుల మధ్య పోటీ నువ్వానేనా అనేట్లు ఉంది…

కోట్లకు వారసులు అయిన ఎంపీ అభ్యర్థులు

వైసీపీ తరఫున గుంటూరు లోక్‌సభకు పోటీచేస్తున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు 81 కోట్ల ఆస్తి ఉండగా…15 కోట్ల విలువైన అప్పులు ఉన్నాయి. ఐదున్నర కోట్ల విలువైన బాండ్లు, షేర్లు ఉండగా..మూడుకోట్లు పర్సనల్‌ లోన్‌ ఎమౌంట్ ఉంది. మొత్తం చరాస్తుల విలువ 12 కోట్లు ఉంది. అలాగే 4 కోట్ల విలువైన వ్యవాయ భూములు ఉండగా… 30కోట్ల విలువైన ఇల్ల స్థలాలు ఉన్నాయి. గుంటూరులో ధియేటర్లు, గోదాములు, దుకాణాలు అన్నీ కలిపి కమర్షియల్ బిల్డింగ్‌ల ఆస్తి విలువ మరో 26 కోట్లకు ఉంది. గుంటూరు లో ఉన్న ఇళ్ల విలువై మరో 8 కోట్లు ఉంటుంది. మొత్తం స్థిరాస్తుల విలువ 70 కోట్లు ఉంది. అలాగే వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు 15 కోట్లుగా ఉంది.

ఆయనపై పోటీపడుతున్న తెలుగుదేశం అభ్యర్థి ప్రవాసాంధ్రుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ సైతం కోట్లకు పడగలెత్తినవాడే. ఆయన తొలిసారి ఎన్నికల్లో పోటీపడుతుండటంతో ఆయన ఆస్తుల వివరాలు తెలియలేదు.

పల్నాడు జిల్లాలోనే మరో లోక్‌సభ నియోజకవర్గం నరసరావుపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీపడుుతున్న సిట్టింగ్ ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయులు…
విజ్ఞాన్ విద్యాసంస్థలు పేరిట తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఆయన పేరిట 17 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా….కోటి రూపాయల విలువైన అప్పులు ఉన్నాయి. బ్యాంకులో డిపాజిట్లు, బాండ్లు రూపేణా 3కోట్ల 68 లక్షల విలువైన ఆస్తులు ఉండగా…కోటి రూపాయల విలువైన వ్యవసాయ భూమి, 10 కోట్లు విలువైన ప్లాట్లు, మరో మూడున్నర కోట్ల విలువైన ఇల్లు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తుల విలువ 14 కోట్ల వరకు ఉంది.

ఇక లావు శ్రీకృష్ణదేవరాయులపై పోటీపడుతున్న వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌కు

6 కోట్ల విలువైన ఆస్తులు ఉండగా… కోటి రూపాయల అప్పు ఉంది. బ్యాంకులో డిపాజిట్లు, పర్సనల్‌ లోన్లు, బంగారం, వాహనాలు అన్నీ కలిపి 2 కోట్ల 80 లక్షల చరాస్తులు ఉండగా…వ్యవసాయ భూమి, ప్లాట్లు కలిపి మూడు కోట్ల విలువ ఉంటుంది. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు మరో కోటి రూపాయల వరకు ఉంది.

ఎలక్షన్ టైం దగ్గర పడుతున్న సమయం ..ఓటర్లు కు వీరు వరాల జల్లులు కురిపిస్తారు..అని ప్రజల నోట వినిపిస్తున్న ..మాటలు..
ఏది ఏమైనా చదువుకున్న విద్యావేత్తలు పోటీకి దిగటం పై వారి ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం గా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

WhatsApp Image 2024 03 26 at 11.35.21 AM

SAKSHITHA NEWS