సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూలు లోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులకు ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి మూడవ అంతస్తులు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు మూడవ అంతస్తులొ పరీక్ష కేంద్రాలను పెట్టడం వల్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు .
విద్యార్థులు పరీక్ష రాయటానికి మూడంతస్తుల ఎక్కి రావటం వలన విద్యార్థులు అలసటపాలవుతారని ఇలాంటి పొరపాట్లు మరల చేయవద్దని ఇన్చార్జి డిఈఓ శైలజను ఆదేశించారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి పరీక్ష కేంద్రానికి పంపాలని, సెల్ ఫోన్లు ఎవరు తీసుకొని రావద్దని కలెక్టర్ సూచించారు. జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు 179 మందికి గాను 179 మంది హాజరయ్యారని, చీఫ్ సూపర్డెంట్ తబిత కలెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఇంచార్జి ఎంఈఓ శైలజ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.